నారాయణ’లో గుండె వ్యాధుల నివారణపై అవగాహన

Sep 30,2024 21:11
గుండె వ్యాధుల నివారణపై అవగాహన

మాట్లాడుతున్న డాక్టర్‌’నారాయణ’లో గుండె వ్యాధుల నివారణపై అవగాహన ప్రజాశక్తి-నెల్లూరు:ప్రపంచ గుండె వ్యాధుల దినోత్సవం సందర్భంగా నారాయణ హాస్పిటల్‌ కార్డియాలజి విభాగం ఆధ్వర్యంలో స్థానిక జెసి భవన్లో జె.ఎ.సి సభ్యులకు గుండె వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ , డివైస్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ రాంకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఈ రోజుని వరల్డ్‌ హార్ట్‌ డేగా జరుపుకుంటుందన్నారు. గుండె యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకునేందుకు, గుండె వ్యాధులు రాకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి అనే దానిపై అవగాహన పెంచుకునేందకు వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహి స్తారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రివెంటివ్‌ హెల్త్‌ చెక్‌ ద్వారా గుండె జబ్బుల భారిన పడకుండా జాగ్రత్తపడలన్నారు. గుండె జబ్బులతోపాటు, గుండె లయ యొక్క అసమానతలను సరిచేయడంలో ఆధునిక చికిత్సా విధానం ఎలక్ట్రోఫిజియాలజిలో ప్రత్యేక నైపుణ్యత అందుకు అవసరమైన సౌకర్యాలు, సిబ్బందితో కూడిన ప్రత్యేక విభాగం నారాయణ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. పదేపదే గుండె దడ, తలతిరగడం, గుండెకు స్టంట్‌ వేయించుకున్న తరువాత గుండె పనితీరు తక్కువగా ఉన్నవారు నారాయణ కార్డియాలజి విభాగంలోని ఎలక్ట్రోఫిజియాలజి సేవలను పొందచ్చన్నారు. ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, సీనీయర్‌ కన్సల్టెంట్‌ డాక్టరు కె. తిలక్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ గుండె వ్యాధులను ఎలా గుర్తించాలి, ఆహారపు అలవాట్లు గురించి, వ్యాయామం, తీవ్రమైన ఒత్తిడి కారణంగా గుండె వ్యాధులు తదితర అంశాలపై వివరించారు. జెఎసి రీజనల్‌ చైర్మన్‌ చలువాది శరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా నారాయణ హాస్పిటల్‌ గుండె వైద్యులు జె.ఎ.సి సభ్యులకు అవగాహన కల్పించేందకు రావడం సంతోషంగా ఉందన్నారు. ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఖరీదైన పన్నెండు వేలు ఖరీదు చేసే వైద్య పరీక్షలను నారాయణ హాస్పిటల్‌ వారు కేవలం రూ 3 వేలకు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ రూపంలో అందిస్తున్నామన్నారు. ఈ చెకప్‌ జె.ఎ.సి సభ్యులందరికీ చేయించేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. జె.ఎ.సి అసోసియేషన్‌ సభ్యులకే కాకుండా వారి కుటుంబాలకు మిగతా అసోసియేషన్లకు రాయితీతో కూడిన ఒక ప్రత్యేక హెల్త్‌ కార్డును అందించాలని హాస్పిటల్‌ యాజమాన్యాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి జె.ఎ.సి సభ్యులకు ఉన్న అపోహలను, సందేహాలను నివత్తి చేసినందుకు గుండె వైద్యులకు కతజ్ఞతలు తెలిపారు. నారాయణ హాస్పిటల్‌ డిప్యూటి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టరు అరుణ్‌కాంత్‌, ఏజీఎం శేఖర్‌ రెడ్డి, జె.ఎ.సి నేషనల్‌ డైరెక్టర్‌ కె. సత్యనారాయణ, జె.ఎ.సి జోన్‌ ట్రెజరర్‌ పి.వి సత్య నారాయణ, జెఎసి జోన్‌ డైరెక్టర్‌ సిహెచ్‌ మధుబాబు, జెఎసి సభ్యులు పాల్గొన్నారు.

➡️