బాల్య వివాహాల నివారణపై అవగాహన

Jan 24,2025 22:28
ఫొటో : మాట్లాడుతున్న సిడిపిఒ రాజ్యలరాజలక్ష్మి

ఫొటో : మాట్లాడుతున్న సిడిపిఒ రాజ్యలరాజలక్ష్మి
బాల్య వివాహాల నివారణపై అవగాహన
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని మైపాడు గిరిజన కాలనీలో బాల్య వివాహాల నివారణపై శుక్రవారం సిడిపిఒ రాజలక్ష్మి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథులుగా పాల్గొని బాల్య వివాహాలపై, చట్టాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఒ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లలకి18 సంవత్సరాల నిండే వరకు వివాహం చేయడం నేరమన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని సూచించారు. గ్రామంలో కిశోరి వికాసం కార్యక్రమంలో బాలికలను గ్రూపుగా ఏర్పాటు చేసి బాల్య వివాహాలు జరిగే సమయంలో తమకు సమాచారం ఇచ్చి బాల్యవివాహాలు అరికట్టేందుకు సహాయ పడాలన్నారు. అదేవిధంగా చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మాయిలకు కలిగే నష్టాలు గురించి ప్రసవ సమయంలో ఎదుర్కొనే సమస్యల గురించి కూలంకుషంగా వివరించారు. అమ్మాయిలు చదువుకొని ఆర్థికంగా ఎదగాలని పెళ్లి వయసు వచ్చేవరకు పెళ్లి చేసుకోకుండా చదువుకొని కొనసాగించాలని తెలియజేశారు. బాల్యవివాహ నిరోధక చట్టం గురించి, సఖి సెంటర్‌ గురించి, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కలిగించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ మంజుల, హెల్త్‌ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్స్‌ గర్భిణులు, తల్లులు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️