మామిడితోటల పునరుద్ధరణపై అవగాహన

ప్రజాశక్తి-టంగుటూరు : జరుగుమల్లి గ్రామంలో మామిడి తోటల పునరుద్ధరణపై రైతులకు మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి ఉద్యాన పరిశోధన కేంద్రం సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ రవీంద్రబాబు మాట్లాడుతూ మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు మరియు 20 సంవత్సరాల కన్నా పైబడిన మామిడి తోటలలో పునరుద్ధరణ చర్యల గురించి వివరించారు, పనికి రాని కొమ్మలు,ఎండు కొమ్మలు కత్తిరించి సూర్య రస్మి అందేలా చెట్టును గొడుగు అకారంలో తయారు చేయాలన్నారు. దీంతో గాలి చక్కగా అంది చీడ, పీడలు తగ్గి మంచి దిగుబడి వస్తుందన్నారు. కొమ్మలు కత్తిరించిన తరువాత బ్లీటొక్స్‌ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి గోపి చంద్‌ , ఉద్యానశాఖ అధికారి డి.ప్రత్యూష, ఎఒ డి.యుగంధర్‌ రెడ్డి, జిల్లా వనరుల అధికారి ఎఒ శైలజ , పశు వైద్య అధికారి డాక్టర్‌ శ్రావణి, గ్రామ ఉద్యాన అధికారులు శ్రీను, రామస్వామి రైతులు పాల్గొన్నారు.

➡️