నులిపురుగుల నివారణ పై అవగాహన కార్యక్రమం

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : నులిపురుగుల నివారణకుహొ అన్ని ప్రభుత్వ పాఠశాలలోహొ సోమవారం నిర్వహించేహొ నులిపురుగులు నివారణ దినోత్సవం కార్యక్రమంపై శుక్రవారంహొ మోర్త, చివటం, గ్రామాలలోని ఎంపీపీ స్కూల్‌, అంగన్వాడి కేంద్రాలలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ రోజా పిల్లలకు చేతులు శుభ్రం చేసుకునే దశలను వివరించి, ఎప్పుడెప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలో వివరించారు. ఏఎన్‌ఎం సరోజహొ ఆల్బండోజోలు మాత్రలు అందరూ వేసుకోవాలని , నులిపురుగులు ఏ విధంగా అనారోగ్యానికి కారణం అవుతాయో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలక్ష్మి, ఎం ఎల్‌ హెచ్‌ పి కే విజయ కుమారి, ఏఎన్‌ఎం డి సూర్య కుమారి, ఉపాధ్యాయులు, ఆశాలు సుజాత,హొ విజయ,హొ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

➡️