ప్రజాశక్తి -భీమునిపట్నం : అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ స్థానిక ప్రభుత్వ డైట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ సిబిఎం హైస్కూల్, గంటస్తంభం, మెయిన్‌రోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకు చేరింది. అనంతరం మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ మాట్లాడుతూ, అవయవ దానం చేయడమంటే మరణించాక కూడా జీవించడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన బెస్ట్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం, సావిత్రీ భాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి, 2వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారిలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, వినోద్ బాబు, బెస్ట్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు పల్లా సూరిబాబు, వైస్ చైర్మన్ తుపాకుల సంతోష్‌రాజ్, కార్యదర్శి అప్పలనాయుడు, డైట్, జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.