బొమ్ములూరులో వ్యర్థాలను వేరు చేయడంపై అవగాహన సదస్సు

ప్రజాశక్తి – గుడివాడ (కృష్ణా) : గుడివాడ మండలంలోని బొమ్ములూరు గ్రామంలో ఆదివారం మండల ప్రత్యేక అధికారి పి.బి సాల్మాన్‌రాజు తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసే విధానాన్ని పరిశీలించి, వీటిపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే పి4 సర్వేను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బివై విష్ణుప్రసాద్‌, ఈవోపిఆర్‌డి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రామమోహనరావు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️