ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి

Nov 11,2024 22:22

బుక్‌లెట్స్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ప్రకృతి వ్యవసాయం, సాగు యాజమాన్య పద్ధతులపై రైతులలో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో వ్యవసాయశాఖ, రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రజాభాగస్వామ్య ప్రకతి వ్యవసాయం వారి ఆధ్వర్యంలో ప్రకతి వ్యవసాయంలో వివిధ పంటల్లో పురుగులు, తెగుళ్ల నివారణ, యాజమాన్య బుక్‌లెట్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ‘మామిడి’లో సస్యరక్షణ… మామిడి పంటలో సస్యరక్షణ చర్యలకు సంబందించి ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు విస్తతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఉద్యానవన శాఖ ద్వారా మామిడి పంటలో సస్యరక్షణ చర్యలకు సంబంధించిన బుక్‌లెట్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఉద్యాన పంట అయిన మామిడిలో పూత నుంచి కోత వరకు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలపై అవగాహన పెంచాలని, రైతులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారికి సూచించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి, ట్రైనీ కలెక్టర్‌ హిమవంశీ, డిఆర్‌ఓ కె.మోహన్‌ కుమార్‌, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు మధుసూధన్‌, మురళిక్రిష్ణ, డిపిఎం వాసు, జిల్లా ఎపిఎంఐపి అధికారి బాలసుబ్రమణ్యం, ఎల్‌డిఎం హరీష్‌ పాల్గొన్నారు.

➡️