ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : బి.కొత్తకోట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసిపి ప్రభుత్వంలో వీరంతా దొంగచాటున ఎంపీటీసీలయ్యారనీ, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాదని వీరు ఎంపీటీసీ సభ్యులుగా అనర్హులని, వీరందరూ వెంటనే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ప్రజల చేత ఎన్నుకోబడి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, లేనిపక్షంలో ఈ సర్వసభ్య సమావేశాన్ని ఎప్పుడూ అడ్డుకుంటామని టిడిపి శ్రేణులు హెచ్చరించారు. గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికలు జరపకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఏకగ్రీవం చేసి ఎంపీటీసీలుగా ఎన్నుకోవడం జరిగిందంటూ … టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ .. నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో బి.కొత్తకోట సీఐ రాజారెడ్డి, మొలకలచెరువు సీఐ రాజు రమేష్, పోలీసు బలగాలు భారీగా మోహరించారు.
బి.కొత్తకోట ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
