కేంద్ర మంత్రులకు బడి సుధా యాదవ్‌ అభినందనలు

ప్రజాశక్తి-రామచంద్రాపురం (తిరుపతి రూరల్‌) : ఎన్డీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి వర్గంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ లు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా … తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, పుదిపట్లకు చెందిన రాష్ట్ర ఒబిసి ఫోరం కన్వీనర్‌ బడి సుధా యాదవ్‌ సోమవారం ఉదయం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బడి సుధా యాదవ్‌ మాట్లాడుతూ … శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు క్యాబినెట్‌ పదవి దక్కడం అభినందనీయమన్నారు.. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు గా సహాయ సహకారాలు అందించాలని బడి సుధా యాదవ్‌ కోరినట్లు తెలిపారు.

➡️