‘పేస్‌’లో బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి-టంగుటూరు: క్రీడాకారులకు విద్యతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమని, అలాగే క్రీడలు వల్ల ఉద్యోగ అవకాశాలు తొందరగా పొందవచ్చని పేస్‌ కళాశాల సెక్రెటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ మద్దిశెట్టి శ్రీధర్‌ అన్నారు. స్థానిక పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జేఎన్టీయూకే బాల్‌ బ్యాడ్మింటన్‌ శనివారం ప్రారంభమయ్యాయి. 350 మంది క్రీడాకారులకు ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కల్పించినట్టు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జివికే మూర్తి తెలిపారు. మొదటి రోజు పేస్‌ కళాశాల జట్టు ప్రకాశం జట్టుపై గెలుపొందింది. మహిళల విభాగంలో కేకేఆర్‌ అండ్‌ కేఎస్‌ఆర్‌ కళాశాల జటు,్ట చలపతి కళాశాల జట్టుపై గెలుపొందింది. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ సెక్రెటరీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ డాక్టర్‌ జి.శ్యామ్‌ కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఐ.మధుసూధనరావు, డీన్‌ అకడమిక్‌ సి సుబ్బారావు, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఆర్‌.వీరాంజనేయులు, డీన్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్‌ రూపా అక్కేష్‌, పాలిటెక్నిక్‌ ప్రిన్సిపల్‌ జి.కోటిరెడ్డి పలు ఇంజనీరింగ్‌ కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️