బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు వేడుకలు యర్రగొండపాలెంలోని టిడిపి కార్యా లయంలో ఆ పార్టీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ సినీ, సేవా రంగాల్లోనే కాకుండా రాజకీయంగా పరిణితి చెందిన నేతగా ఎదిగారని అన్నారు. హిందూ పురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, కామేపల్లి వెంకటేశ్వర్లు, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, కొత్తమాసు సుబ్రమణ్యం, కొత్తమాసు కృష్ణయ్య, మల్లికార్జున చారి, మెడబలిమి అచ్యుతరావు, గురిజేపల్లి జిలాని, తోటా మహేష్‌ నాయుడు, కె భాస్కర్‌, వెంకట్రావు గౌడ్‌, మస్తాన్‌వలి, షేక్‌ వలి, సుభాని తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొడ్డు శంకర్‌, బాపట్ల పార్లమెంట్‌ టీఎన్‌టీయుసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పావులూరి నారాయణస్వామి చౌదరి, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు నార్నె మాధవీలత, బాపట్ల పార్లమెంట్‌ సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ రావులపల్లి సురేష్‌బాబు, ఉపాధ్యక్షులు చెరు కూరి వెంకటసుబ్బయ్య, నాయకులు సాధినేని శ్రీరామమూర్తి, చెరుకూరి శ్రీనివాసరావు, చిట్టెంశెట్టి శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీనివాసరావు, అట్లూరి భిక్షాలు, చెరుకూరి బోస్‌, మొనపాటి బ్రహ్మయ్య, వేమా అంకంశెట్టి, మట్టా పోలిశెట్టి, షేక్‌ సుభాని, గుంటూరు రంగనాయకులు, మద్దిరాల సుబ్బారావు, పొన్నం ఇంద్రబాబు, మందాడి శ్రీనివాసరావు, బియ్యపు రామదాస్‌, బొడ్డపాటి వీరయ్య, ముద్రగడ రాఘవ తదితరులు పాల్గొన్నారు. కంభం రూరల్‌: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టిన రోజు వేడుకలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కంభం మండల అధ్యక్షులు జూనియర్‌ గౌస్‌ ఆధ్వర్యంలో కంభం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ గిద్దలూరు నియోజకవర్గం అధ్యక్షులు నూరుల్లా ఖాద్రీ, సోమయ్య, కేతం శ్రీనివాసులు, సయ్యద్‌ గౌస్‌, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు దాదా తదితరులు పాల్గొన్నారు.

➡️