విశాఖ : సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ అంగులూరి బాలకృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా … మంగళవారం తిమ్మరాజుపేట గ్రామంలో బాలకృష్ణ చిత్రపటానికి తిమ్మరాజుపేట గ్రామ ఉపసర్పంచ్ బి శెట్టి.రాము సిపిఎం శాఖ కార్యదర్శి సరగడం. రాము నాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కర్రి.అప్పారావు మాట్లాడుతూ …. బాలకృష్ణ నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేసేవారని అచ్చుతాపురం ఎస్. ఈ. జెడ్ , ఎన్ ఏ ఓ బి ,అన్ రాక్, పరవాడ ఫార్మా నిర్వాసితుల సమస్యలపై పోరాడారని, నల్ల బెల్లం సమస్యపై ,రైవాడ నీరు రైతుల కందాలని, కౌలు రైతులు కు కౌలు కార్డులు రుణాలు ఇవ్వాలని అనకాపల్లి జిల్లాలో ఎవరి కష్టం వచ్చినా వారి సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహించారని వారి ఆశయ సాధన కోసం ప్రజలంతా భుజం భుజం కలిపి ఐక్య పోరాటాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము, బ్రహ్మాజీ, కర్రీ. ఆదినారాయణ ,శరగడం ఆది బాబు తదితరులు పాల్గొన్నారు.