బలరాం కాలనీలో ఇళ్లస్థలం ఇప్పించండి : మాజీ ఎమ్మెల్యే ఆమంచితో మొరపెట్టుకున్న నిరుపేదలు

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ బలరాంకాలనీలో అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని గజం భూములేని మాకు ఇంటి స్థలాలు ఇవ్వలేదని ఎలాగైనా తమరు మాకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కు దేశాయిపేట చేనేత కుటుంబాలకు చెందిన నిరుపేదలు ఆదివారం మొరపెట్టుకున్నారు. వివరాల్లోకెళితే … దేశాయిపేట పంచాయతీ వివేకానంద కాలనీ పక్కన గత సంవత్సరం బలరాం కాలనీ వెలిసింది. ఈ కాలనీలో సొంతిల్లు ఉన్న వాళ్ళు సైతం మళ్లీ స్థలాలు తీసుకున్నారు. గజం భూములేని నిరుపేదలు మాత్రం అట్లాగే మిగిలిపోయి ఉన్నారు వీరందరూ గత ప్రజాప్రతినిధులను ప్రాధాయపడిన కనికరించలేదని విమర్శలు ఉన్నాయి. తమరైన మా గోడు పట్టించుకోని మాకు న్యాయం చేయాలి అంటూ శనివారం ఆమంచి కృష్ణమోహన్‌ ని కలిసి మొరపెట్టుకున్నారు. ఇళ్ల స్థలాల గురించి సావధానంగా ఆలకించిన ఆమంచి కృష్ణమోహన్‌ చట్టపరంగా ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆమంచి కృష్ణమోహన్‌ను కలిసిన వారిలో దేశాయిపేట గ్రామానికి చెందిన 50 మంది ప్రజలు పాల్గొన్నారు. ఆయనను కలిసిన వారిలో లేళ్ల సోమశేఖర్‌, సజ్జ పాపారావు, కపిల్‌, వెంకట సుబ్బారావు పేర్నేటి నాగరాజు ఉన్నారు.

➡️