హైడ్రో ప్రాజెక్టులకు బాలారిష్టాలు

జిల్లాలో హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేఅన్న చందంగా మారింది. గత వైసిపి సర్కారు హయాంలో జిల్లాకు ఆరు హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు 1,017 ఎకరాల విస్తీర్ణంలో 5,600 మెగావాట్ల సామర్య్థంతో విద్యుత్‌ ఉత్పాదన చేయడానికి ముందుకు వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకుల దౌర్జన్యాలు, దాడులు, కేసుల చోటుచేసుకున్న నేపథ్యంలో జిల్లాకు పరిశ్రమలు రావడానికి పునరాలోచనలో పడ్డాయనే వాదన వినిపిస్తోంది. రెండు హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ పరిశ్రమల యాజమాన్యాలు వెళ్లిపోగా, నాలుగు పరిశ్రమలు మాత్రమే 3,200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యంతో ఏర్పాటు చేయడానికి సైతం మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం.ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలో హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు బాలారిష్టాలను ఎదు ర్కొంటు న్నాయి. 2019- 2024 వైసిపి సర్కారు హయాంలో జిల్లాలోని గండికోట రిజర్వా యర్‌, సోమశిల రిజర్వాయర్‌, పైడిపాలెం ఈస్ట్‌, పైడిపా లెంవెస్ట్‌ రిజర్వా యర్‌, వేంపల్లి మండల ప్రాంతాల్లో 1017 ఎకరాల విస్తీర్ణంలో 5,600 మెగావాట్ల సామర్థ్య ంతో ఏర్పాటు చేయడానికి హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ సంస్థలు ముందుకు రావడం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారం చేతులు మారడంతో జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బిజెపి నాయకుల దాడులు, దౌర్జన్యాలు, కేసుల కారణంగా ఆరు ఇంధన సంస్థల్లో రెండు సంస్థలు పరిశ్రమల ఏర్పాటు నుంచి వెనకడుగు వేయడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండల పరిధిలో కె.బొమ్మేపల్లి గ్రామ సమీపంలో 41.99 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో మరో 191.64 ఎకరాల్లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పైడిపాలెం రిజర్వాయర్‌ పరిధిలోని ముద్ద నూరు మండల పరిధిలోని మంగపట్నం, కొర్రపాడు, సింహాద్రిపురం మండ లంలోని పైడిపాలెం గ్రామంలో 466.27 ఎకరాల్లో 1,200 మెగావాట్ల సామ ర్థ్యంతో, మరో 317.14 ఎకరాల్లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఇండో సోల్‌ సోలార్‌ ప్రయివేటు లిమిటెడ్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. గోపవరం మండల పరిధిలోని రాచాయపేట గ్రామ సమీపంలోని సోమశిల రిజర్వాయర్‌ వెనకజలాల ప్రాంతాల్లో షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ ప్రయి వేటు లిమిటెడ్‌ 900 మెగావాట్ల సామర్య్థం, వేంపల్లి మండలం వెలమవారిపల్లి ప్రాంతాల్లో 1,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యంతో ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఆరింటిలో నాలుగు సంస్థలే..!కొండాపురం మండలం బొమ్మేపల్లి గ్రామంలో అదానీ సంస్థ హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటు వ్యవహారంలో జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు రాష్ట్ర స్థాయి బిజెపి నాయకులు దాడులు, దౌర్జన్యాలు, కేసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఆరు హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల్లో రెండు ప్రాజెక్టుల యాజమాన్యాలు వెనుకడుగు వేశాయనే వాదనవినిపిస్తోంది. జిల్లాలోని ఆరు హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల నుంచి 5,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ఉత్పాదన కావాల్సి ఉండగా, 3,200 మెగావాట్లకు పడిపోవడం గమనార్హం.ఏళ్ల తరబడి డిపిఆర్‌ దశలోనేజిల్లాలో అదానీ, షిరిడీ సాయి, ఇండోసాల్‌ కంపెనీలు హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ పరిశ్రమల ఏర్పాటు డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు తయారీ దశలో ఏళ్ల తరబడి సాగుతోంది. హైడ్రో పంప్డ్‌ స్టోరేజీ పరిశ్రమలన్నీ రెవెన్యూ, ఫారెస్ట్‌ భూముల్లో ఏర్పాటు చేయాల్సిన నేపథ్యంలో ఫారెస్ట్‌ భూముల సేకరణ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. హైడ్రో పంప్ట్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు అనుమతి లభించడానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పరిధిలోని 11 డైరెక్టరేట్ల నుంచి అనుమతులు లభించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

➡️