ప్రజాశక్తి – రాయచోటి జిల్లా అభివద్ధిలో బ్యాంకర్ల భాగస్వామ్యం ఎంతో కీలకమని, సమాజ ఆర్థికాభివద్ధి తోపాటు జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డిసిసి), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డిఎల్‌అర్‌సి) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు మొదటి త్రైమాసికం ముగిసేనాటికి నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆర్ధిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరమన్నారు. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మూడవ త్రైమాసికం డిసెంబరు 31 నాటికి జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.10,290 కోట్లకు గాను రూ.13,544 కోట్ల రుణాలు మంజూరు చేసి 131.62శాతం ఆర్థిక ప్రగతిని సాధించిందని చెప్పారు. ప్రాధాన్యత రంగంలో రూ.8804 కోట్ల లక్ష్యానికి గాను రూ.10929 కోట్లు మంజూరు చేసి 124.31 శాతం ప్రగతి సాధించారన్నారు. అన్నమయ్య జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, ఈ రంగంలో వ్యవసాయ రుణాలలో రూ.7573 కోట్లు లక్ష్యానికి రూ.9,741 కోట్లు మంజూరు చేసి 132 శాతం ఆర్థిక ప్రగతిని సాధించామని చెప్పారు. ఇతర ప్రాధాన్యతా రంగాలలో భాగంగా ఎంఎస్‌ఎంఇ సెక్టార్‌కు సంబంధించి రూ.987 కోట్లు మంజూరు చేసి కేవలం 7.5శాతం ప్రగతి సాధించారని, దీన్ని మరింత మెరుగుపరచాలని ఆర్‌బిఐ సూచించిన మేరకు 18 మేర రుణకల్పన ఉండాలని అన్ని బ్యాంకులకు సూచించారు. రూ.2,354 కోట్లు విద్యా రుణాలు, రూ. 2,803 కోట్లు గహ రుణాలు అందజేశారని, అర్హత మేరకు రుణాల మంజూరు ను పెంచాలని తెలిపారు. ఆర్థిక చేకూర్పులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు కషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఆర్థిక అక్షరాస్యత పై విస్తత అవగాహన కల్పించాలని ఎల్డీఎంకు సూచించారు. మహిళా సంఘాలకు రుణకల్పనలో 64 శాతం ప్రగతి సాధిం చారని, ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 100 శాతం రుణాలు కల్పించాలన్నారు. పీఎం ఈజిపి పథకం కింద గ్రౌండ్ అయిన 106 యూనిట్లకు రూ.64 కోట్లు, ముద్ర రుణాల కింద 19848 యూనిట్లకు రూ 394 కోట్లు రుణాలు అందిం చినట్లు పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ, స్టాండ్ అప్ ఇండియా పథకంలలో ప్రగతిలో చాలా వెనుకబడి ఉన్నారని ఈ మాసాంతంలోగా లక్ష్యాన్ని సాధిం చాలని సూచించారు. 3662 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.55.78 కోట్లు రుణాలు అందించారని చెప్పారు. 583 మంది కౌలు రైతులకు రుణాల అందించారని చెప్పారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత దఢంగా ఉంటుందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం అనేక రకాలయిన సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అందుకు సంబంధించి అన్ని రకాల బ్యాంకు శాఖలు ఆయా పట్టణ, గ్రామీణ పరిధిలో రుణ పథకాలకు అర్హత పొందిన లబ్దిదారులకు పెండింగ్ లేకుండా రుణాలు అందిం చాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. గ్రామాల పరిధిలో బ్యాంకింగ్ సేవలను విస్తతం చేసి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఆర్ధిక లావాదేవీలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభు త్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలపై ప్రత్యేక దష్టి సారించా లని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో రైతులు, మహిళా సంఘాలు, విద్యార్థులకు బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను తరచూ నిర్వహించాలన్నారు. పిఎం కిసాన్ లబ్ధిదారులకు కేసిసి మంజూరుకు సంబంధించి ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ధ్యాలను అధిగమించాలన్నారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశానికి సంబంధించిన అజెండా వివరాలను, ఆయా అంశాలలో బ్యాంకుల సాధించిన ప్రగతిని కలెక్టర్ కి వివరించారు. అనంతరం కలెక్టర్ నాబార్డ్ వారి 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ను బ్యాంకర్లతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో ఎస్‌బిఐ, నాబార్డ్ ఎజిఎం విజరువిహారి, ఆర్‌బిఐ ఎల్‌డిఎం రోహిత్ అగర్వాల్, బ్యాంక్ మేనేజర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, డిక్కి, డిఐఎ ప్రతినిధులు పాల్గొన్నారు.
