బాపట్ల డివిజన్‌ స్థాయి క్విజ్‌ పోటీలు

ప్రజాశక్తి – నిజాంపట్నం:  రాజ్యాంగ దినోత్సవం, సాంఘిక శాస్త్ర దినోత్సవం పురస్కరించుకుని ఏపీ సోషల్‌ స్టడీస్‌ టీచర్స్‌ ఫోరం (ఏపీ ఎస్‌ఎస్టిఎఫ్‌) ఆధ్వర్యంలో మం గళవారం మండలంలోని చింకపాలెం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. బాపట్ల జిల్లా లో బాపట్ల డివిజన్‌ స్థాయిలో భారత రాజ్యాంగం, ప్రో కబడ్డీ అనే అంశాలపై పోటీలు నిర్వహించారు. ప్రథమ స్థానం చెరుకుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాల విద్యార్థులు జి.చైత్ర పౌర్ణమి, పీ షణ్ముఖ సాయి, వై ఋషి శ్రీలు సాధించారు. ద్వితీయ స్థానంలో ఎల్‌.గణేష్‌ కుమార్‌, వి.ఎన్‌.వి రామకష్ణ, టి.హేమ కుమార్‌ నిలవగా, తతీయ స్థానం జడ్పీహెచ్‌ఎస్‌ అడవులదీవి కె.పుష్పహాసిని, ఎమ్‌.హేమంత్‌, వి.చందు సాధించారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ విద్యా ర్థుల్లో ఉన్న సజానాత్మక శక్తిని, ప్రతిభా సామర్ధ్యాలను గుర్తించడానికి క్విజ్‌ కార్యక్రమం నిర్వహించడం జరి గిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన ్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు మహమ్మద్‌ యాకుబ్‌, నా యుడు వెంకటేశ్వరరావు, డి.రామకష్ణ, జి.పుల్లారావు, కే.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️