ప్రజాశక్తి – పంగులూరు
షుగరు, బీపీ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో పెట్టవచ్చని విశ్రాంత హెచ్‌ఎం కర్రి కమలేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు కందిమల్ల రామ కోటేశ్వరావు అన్నారు. గంగవరంలోని మంచాల వెంకటరామయ్య, రంగమ్మ కళ్యాణ వేదికలో గంగవరం ఆరోగ్య, సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఉచిత రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. కర్రి రామయ్య (బాపమ్మ) జ్ఞాపకార్థం ఆయన భార్య కర్రి విజయలక్ష్మి, కుమారుడు వాసుబాబు, కోడలు విష్ణు ప్రియ, కుమార్తె కల్పన, కుటుంబ సభ్యుల సహకారంతో వైద్యశిభిరం నిర్వహించారు. డాక్టర్ ఎ సాంబయ్య రోగులను పరీక్షించి మందులను రాశారు. కె బాలచందర్, తలపనేని రామారావు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంకట సుబ్బారావు, రఘుచంద్, సృజన, జ్యోతి, ఎవి సుబ్బారావు, బోడెంపూడి సూరిబాబు, బత్తుల హనుమంతరావు, కరి జగన్నాథం, తన్నీరు గోవిందరాజులు పాల్గొన్నారు.
