ప్రజాశక్తి – మార్టూరు రూరల్
సమాజ సేవలో ముందుండి పలు అభివృద్ధి పధకాలు పేదల ముందుకు తీసుకెళ్లడంలో విశేష కృషి చేసిన కోలలపూడి ఇన్నర్ వీల్ క్లబ్ శతాబ్దికి రాష్ట్ర స్థాయిలో అవార్డులు దక్కాయి. ఈ సందర్బంగా తెలంగాణా రాష్ట్రం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ శతాబ్ది అధ్యక్షురాలు కందిమళ్ల నిర్మల 315జిల్లా అధ్యక్షురాలు సునీత జైన్మ్, జిల్లా చైర్మన్ కోలా విజయలక్ష్మి చేతుల మీదుగా ఉత్తమ అధ్యక్షురాలు అవార్డును అందుకున్నారు. క్లబ్ తరపున 71ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తిచేసినందుకు మరో 11సర్టిఫికెట్లు కోలలపూడి శతాబ్దికి అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలో ఇన్నర్ వీల్ క్లబ్ ఉత్తమ అవార్డులు అందుకున్నందుకు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు బసవరాములు, రావి అంకమ్మ చౌదరి, కొర్రపాటి కాజారావు, ఆంజనేయులు, కోలలపూడి సర్పంచ్ మోరపాకుల సతీష్ కుమార్, క్లబ్ కార్యదర్శి శివకుమారి, అరుణ కుమారి అభినందనలు తెలిపారు.
