పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Feb 11,2024 12:44 #Bapatla District
A spirited gathering of alumni

ప్రజాశక్తి – చీరాల : చీరాల వీఆర్ ఎస్ అండ్ వై ఆర్ ఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేదిక రామాపురం పేరల్ రిసార్ట్ లో ఘనంగా కళాశాల పూర్వ విద్యార్థుల ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన్ మాజీ వైద్య శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, సినీనటుడు కొల్లా అశోక్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు డి రమాదేవి, మాజీ ఐఆర్ ఎస్ అధికారి దగ్గుమళ్ళ ప్రసాదు, పలువురు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పలు సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

➡️