కాలినడకన వెళ్లి టిడిపి కార్యకర్తల దైవదర్శనం

Jun 8,2024 23:43 ##TDP #Panguluru #Inkollu

– పంగులూరు నుండి గుణదలకు టిడిపి కార్యకర్తలు పాదయాత్ర
– ఇంకొల్లులో ఆంజనేయ స్వామి వద్దకు టిడిపి పాదయాత్ర
ప్రజాశక్తి – పంగులూరు
ఎంఎల్‌ఎగా గొట్టిపాటి రవికుమార్ 5వ సారి విజయం సాధించడంతోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారానికి వచ్చి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మండలంలోని ముప్పవరం ఎస్సీ కాలనీకి చెందిన టిడిపి కార్యకర్తలు కాలినడకన వెళ్లి గుణదల మేరీ మాతను దర్శించుకునేందుకు శనివారం బయలుదేరారు. ముప్పవరం జాతీయ రహదారి పక్కనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు కుక్కపల్లి ఏడుకొండలు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన మళ్లీ మొదలు కాబోతుందని అన్నారు. నియోజకవర్గం ప్రజలు టిడిపిని ఆదరించి గొట్టిపాటి రవికుమార్‌ను మరోసారి ఎంఎల్‌ఎగా భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. పేద వర్గాల అభివృద్ధి కోసం పనిచేసే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడని అన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. గుణదల మేరీ మాత ఆలయానికి పాదయాత్రగా బయలు దేరుతున్న దళిత యువకులను ఆయన అభినందించారు. పాదయాత్రలో చింతల నాగేశ్వరరావు, దుడ్డు మత్తయ్య, వేల్పుల మరియదాస్, వేల్పుల అశోక్, చింతల డేవిడ్ పాల్, అద్దేపల్లి ఏసుబాబు, వేల్పుల ఏసుబాబు, కొమ్ము డేవిడ్, అద్దేపల్లి వందనం, అద్దేపల్లి రవీంద్ర, అంజయ్య, తాతపూడి వందనం ఉన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు అల్లంనేని బ్రహ్మానంద స్వామి, టిడిపి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వలపర్ల సుబ్బారావు, గరిమిడి జగన్ మోహనరావు, దూళిపాళ్ల భావనారాయణ, వీరాంజనేయులు, శంకర్, హనుమంతరావు పాల్గొన్నారు.


ఇంకొల్లు : పర్చూరు ఎంఎల్‌ఎ ఏలూరు సాంబశివరావు అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా మండలంలోని పూసపాడు, కారంచేడు మండలం తిమర్తపాడు గ్రామస్తులు శనివారం ఉదయం ఆయా గ్రామాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఇంకొల్లు పొలిమేర ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ముందుగా తిమిర్తిపాడు గ్రామానికి చెందిన టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు పూసపాడు చేరి అక్కడ నుంచి అడ్డరోడ్డు, దగ్గుబాడు, నాయుడు వారిపాలెం మీదుగా ఇంకొల్లు పర్చూరు రోడ్డులోని ఆంజనేయస్వామి, టిడిపి కార్యాలయం, రామ మందిరం, స్తూపం సెంటర్, జండా చెట్టు మీదుగా పెద్ద బజారు నుంచి శివాలయంకు చేరి అక్కడ నాగుల చెరువు కట్టమీద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఇంకొల్లు పొలిమేర ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టిడిపి మండల అధ్యక్షులు నాయుడు హనుమంతురావు, ఇంకొల్లు మాజీ సర్పంచి బోడోల శ్యాంసుందర్, జనసేన రాష్ట్ర నాయకులు పెదపూడి విజయకుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. తిమిర్తిపాడు టిడిపి నాయకులు బొడావుల రంగనాయకులు, దండా శ్రీనివాసరావు, పోపూరి శివయ్య, దండా మోహన్, పాశం వీరాంజనేయులుతోపాటు పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని పూసపాడు నుంచి అడ్డరోడ్డు మీదగా దగుపాడు, ఇంకొల్లు స్థూపం సెంటర్‌, ఎన్టీఆర్దు విగ్రహం, పొలిమేర ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన గంటా బాబు, కరణం రమేష్, పర్చూరు శీను, కంకట రాంబాబు పాల్గొన్నారు.

➡️