అఖిలేష్ యాదవ్ విజయోత్సవం

Jun 10,2024 23:25 ##Bapatla #SP

ప్రజాశక్తి – బాపట్ల
లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విజయానికి హర్షం వ్యక్తం చేస్తూ సమాజ్‌ వాది పార్టీ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు స్థానిక ఏరియా వైద్యశాల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇండియా కూటమి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించి మొత్తం 43 స్థానాల్లో విజయం చారిత్రిత్మాక విజయం సాధించారని అన్నారు. కార్యక్రమంలో విలియం బూత్‌ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ లివింగ్ స్టన్, కాండ్రు శరత్ కుమార్, మోర్ల చిన్న వెంకటేశ్వరరావు, మాజీ సైనిక సంక్షేమ సంఘ నాయకులు తోట దుర్గారావు పాల్గొన్నారు.

➡️