ఆనందబాబు విస్తృత పర్యటన

Feb 13,2024 01:01

ప్రజాశక్తి – వేమూరు
నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు సోమవారం విస్తృతంగా పర్యటించారు. అమర్తలూరుకు చెందిన టిడిపి నాయకులు యాజలి వెంకటేశ్వరరావు కుమారుని వివాహ వేడుకలకు, అమృతలూరు మండలం పెదపూడి గ్రామానికి చెందిన గాజులవర్తి చిన్నా కుమారుని వివాహం, చుండూరు మండలం చిన్నపరిమి గ్రామానికి చెందిన చొప్పర జయరావు కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వాదించారు. కొల్లూరు మండలం కీస్కిందపాలెం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు పులివర్తి చిన ఆనందం ఇటీవల పాము కాటుకు గురై డివిసి వైద్య శాల్లో చికిత్స పొందుతుండగా ఆయనను పరామర్శించారు.

➡️