అనగాని హ్యాట్రిక్ విజయం పట్ల హర్షం

Jun 10,2024 00:14 ##Repalle #tdp #Anagani

ప్రజాశక్తి – రేపల్లె
ఎన్నికల్లో 400018 ఓట్ల ఆధిక్యంతో ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ హాట్రిక్‌ విజయాన్ని సాధించిన సందర్భంగా మండలంలోని పేటేరు గ్రామ టిడిపి నాయకులు రెబ్బా కోదండరాం స్థానిక నాయకులతో కలిసి ఆదివారం గ్రామంలోని అన్ని చర్చిల్లో ప్రార్ధన సమయంలో స్వీట్స్ పంచిపెట్టారు. పాస్టర్లు ఆయా చర్చిల్లో ఎంఎల్‌ఎ విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పేదల కోసం అనేక మౌలిక సదుపాయాలు కల్పించి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసింది టిడిపి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేయటం టిడిపి ప్రభుత్వంలోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో టిడిపి గ్రామ నాయకులు పుసులూరు కోటేశ్వరరావు, గోలి రామ శేషగిరిరావు, దీవి సురేష్, వెంకటేశ్వరరావు, డివిఎస్ఆర్ శాస్త్రి పాల్గొన్నారు.

➡️