టిడిపి ఆధ్వర్యంలో అన్నదానం

Jun 10,2024 00:21 ##Vetapalem #tdp #Kondaiah

ప్రజాశక్తి – వేటపాలెం
మండలంలోని దేశాయిపేట పంచాయతీ నీలకంఠపురంలోని అనాధ ఆశ్రమం నందు టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదానం చేశారు. అఖండ విజయం సాధించిన చీరాల ఎంఎల్‌ఎ మద్దులూరి మాలకొండయ్యకు రాబోయే కేబినెట్‌లో మంత్రి పదవి రావాలని ఆశిస్తూ అన్నదానం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి నాసిక వీరభద్రయ్య, టిడిపి నాయకులు ధోగుపర్తి బాలకృష్ణ, జనసేన నాయకులు హర్ష, కిరణ్, తేజమణి, శివ, పిచ్చుక వెంకట సుబ్బారావు, గ్రంధి నాగంజనేయులు, జగదీష్ పాల్గొన్నారు.

➡️