టిడిపి ఆధ్వర్యంలో అన్నదానం

Jun 10,2024 23:28 ##Addanki

ప్రజాశక్తి – అద్దంకి
మండలంలోని చినకొత్తపల్లి గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా గ్రామం నుండి సింగరకొండకు పాదయాత్రగా వెళ్లి ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. పొంగళ్ళు పెట్టి మొక్కు తీర్చుకున్నారు. గ్రామంలో అన్నదానం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు చాగంటి గణపతి, క్లస్టర్ ఇంచార్జి మానం మురళీమోహనదాస్, నాయకులు యడవల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మానం సరిత, టిడిపి, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.

➡️