ప్రజాశక్తి – బాపట్ల
సీజనల్ వ్యాధులు, దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల పట్ల విద్యార్థులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని పట్టణ ఆరోగ్య పర్యవేక్షకులు జూగుంట రాంబాబు విద్యార్థులకు సూచించారు. డెంగ్యూ వ్యాధి వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా పట్టణంలో ఎవివి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం యడ్ల సత్యవతి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డెంగ్యూ, మలేరియా నివారణ అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ దోమల నియంత్రణకు దోమతెరలు వాడాలని అన్నారు. పాఠ్యాంశాల్లో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ అనే అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే ని డ్రై డేగా పాటించాలని చెప్పారు. జ్వరాలు రాకుండా, సీజనల్ వ్యాధుల భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కాచి చల్లార్చిన క్లోరినేషన్ చేసిన నీటిని త్రాగాలని అన్నారు. ఆహారంపై ఈగలు వాలకుండా మూతలు పెట్టి ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తినే ఆహారం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. పాఠశాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బాల బాలికలు విద్యార్థి దశ నుండే ఆరోగ్య సూత్రాలు పాటించాలని అన్నారు. పాఠశాల హెచ్‌ఎం సత్యవతి మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తెలియజేసే గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కార్యకర్త రమాదేవి, ఆశా కార్యకర్త స్వాతి, అంగనవాడీలు పాల్గొన్నారు.
