నీట్, నెట్ పేపర్‌లీక్‌ నిరసిస్తూ 4న బంద్

Jul 3,2024 00:24 ##Battiprolu #SFI

ప్రజాశక్తి – భట్టిప్రోలు
నీట్‌ పరీక్ష దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈ ఏడాది అవతవకలు జరిగాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి మనోజ్ ఆరోపించారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, పరీక్షలను రద్దుచేసి మరో సారు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 4న ఎల్‌కెజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బందుకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నీట్ పరీక్ష నిర్వహించే ఎన్‌టిఎను రద్దుచేసి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మొర పెట్టుకున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎన్‌టిఎను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. దానిని విస్మరించి బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని, నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామనే ప్రకటన కూడా ఇవ్వకపోవడం బాధ్యతా రాహిత్యం కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన విద్యా విధానం పేరిట దేశ వ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 4న విద్యా సంస్థల బంధు నిర్వహించడానికి విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చాయని అన్నారు. ఈ మేరకు స్థానిక గాయత్రి అకాడమీలో బందు కరపత్రాలు మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మొహిద్దిన్ పాల్గొన్నారు.

➡️