ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

May 25,2024 00:34

ప్రజాశక్తి – చీరాల
జూన్‌ 4న జరుగునున్న ఓట్లు లెక్కింపులో ఎజెంట్లు, ముఖ్య నేతలు అప్రమత్తంగా ఉండాలని టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కొండయ్య అన్నారు. స్థానిక టిడిపి కార్యలయంలో ఓట్ల లెక్కంపుపై టిడిపి నేతలతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధి విధానాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఓట్ల లెక్కంపు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు చేశారు. సీనియర్‌ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, వేటపాలెం అధ్యక్షులు బొగ్గుల పార్థసారథి, చీరాల రూరల్‌ అధ్యక్షులు గంజి పురుషోత్తం, డేటా నాగేశ్వరరావు, కర్ణ శ్రీనివాసరావు, కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య, కొమ్మనబోయిన రజిని, కౌతరపు జనార్ధనరావు, కొండ్రు రత్నబాబు, జనసేన నాయకులు గూడూరు శివరామప్రసాదు, మామిడాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️