గౌడ కల్యాణ మండపానికి భూమిపూజ

Feb 11,2024 22:44

ప్రజాశక్తి – రేపల్లె
పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారి వివాహాలు జరిపించుకునేందుకు కల్యాణ మండపం నిర్మించేందుకు దాతలు ముందుకు రావటం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని బేతపూడిలో గౌడ కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి విరాళం ఇచ్చిన దాతలను సన్మానించారు. కార్యకమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంతాని మురళీధరావు, తాతా ఏడుకొండలు, కేసన రామకృష్ణ, బెల్లంకొండ రాఘవ, విచారపు వీరయ్య, సమ్మెట కోటేశ్వరరావు, పుషాడపు కుమారస్వామి, వేజండ్ల పూర్ణనంద్, నాగుల నరేంద్ర, ఉప్పాల సాంబశివరావు పాల్గొన్నారు.

➡️