అర్జీదారులకు అల్పాహారం

Jul 16,2024 00:53 ##Bapatla #Redcross

ప్రజాశక్తి – బాపట్ల
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పిర్యాదులు చేసుకునేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన అర్జీ దారులకు రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం అల్పాహారం అందజేశారు. కొలను మోహన్ సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ నారాయణ భట్టు, డిజాస్టర్ టీం సభ్యులు డివి రమణబాబు, బి రామసుబ్బారావు, సత్యనారాయణ రాజు, మల్లెల వేణు, గోపీ పాల్గొన్నారు.

➡️