కేక్ కటింగ్ తో విజయోత్సవాలు

Jun 10,2024 23:14 ##Vemuru Tdpnews #Anandababu

ప్రజాశక్తి – వేమూరు
టిడిపికి అఖడ మెజార్టీ అందించిన ప్రజలకు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కనగాల మధుసూధన ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో సోమవారం రాత్రి టిడిపి, జనసేన నాయకులు కేక్ కట్ చేసి మెజార్టీ సాధనకు కృషిచేసిన మధుసూదన్ ప్రసాద్‌ను షాలువాతో సత్కరించారు. నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️