అద్దేపల్లిలో సెల్ టవర్ పనులు నిలిపివేయాలి

Jun 11,2024 23:03 ##Battiprolu #cpm #cellTower

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండల కేంద్రమైన భట్టిప్రోలు ఆద్దేపల్లి గ్రామంలో ప్రైవేటు 5జి సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఎం నాయకులు తహశీల్దారు ఐ మునిలక్ష్మికి వినతి పత్రం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మురుగుడు సత్యనారాయణ మాట్లాడుతూ నివాస గృహాల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్‌తో రేడియేషన్ ప్రభావానికి అనారోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. నిరంతరం కూలి పనులు చేసుకుని జీవించే పేదవారికి ఆరోగ్య రీత్యా పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కావడమే కాక తలనొప్పి, క్యాన్సరు, చర్మవ్యాధులు వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. కూలీ పనిచేసుకునే పేదలకు రోగాలు సంభవిస్తే వైద్య ఖర్చులు భరించే స్తోమత లేదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే సెల్‌ టవర్ నిర్మాణానికి అనుమతులు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. లేకుంటే దళితవాడ ప్రజలంతా ఐక్యమై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పి మనోజ్, సిపిఎం నాయకులు బట్టు నాగమల్లేశ్వరరావు, గ్రామస్తులు ఇర్మియా, కిరణ్, రవిచంద్ర, ఏసోబు, మురళి పాల్గొన్నారు.

➡️