ముగిసిన బాలల వేసవి శిక్షణ శిబిరం

Jun 10,2024 00:05 ##Bapatla #cpm #utf #Jvv

ప్రజాశక్తి – బాపట్ల
బాల్యం దశ నుండి మూఢనమ్మకాలతో కలిగే అనర్ధాలను విద్యార్థులకు అవగాహన కల్పించాని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని ఉప్పరపాలెంలో సిపిఎం, యుటిఎఫ్ సంయుక్తంగా వారం రోజులపాటు వేసవి సెలవుల్లో విద్యార్థులకు విజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థి దశనుండే శాస్త్రీయ విజ్ఞానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. మూఢనమ్మకాలతో కలిగి నష్టాలను విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రధానంగా విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. తల్లి, దండ్రులను, గురువులను గౌరవించి సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని అన్నారు. మూఢనమ్మకాలను పారుదోలి శాస్త్రీయ విజ్ఞానంతో సమాజ శ్రేయస్సుకు పాటుపడే దిశగా విద్యార్థులు మంచి నడవడిక కలిగి ప్రవర్తించాలని అన్నారు. సిపిఎం, యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బాలల వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులు పాటు నిర్వహించిన బాలల వేసవి శిక్షణ శిబిరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, ఉపాధ్యాయులు పివి సాంబశివరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జడ వినయ్ కుమార్, ఉపాధ్యాయులు చక్రధర్, సిఐటియు నాయకులు శరత్, సిపిఎం ఉప్పరపాలెం శాఖ కార్యదర్శి షేక్ మహబూబ్ సుభాని పాల్గొన్నారు.

➡️