ఆనందబాబుకు అభినందనలు

ప్రజాశక్తి – భట్టిప్రోలు
వేమూరు ఎంఎల్‌ఎగా గెలుపొందిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబును మండలంలోని ఐలవరం గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి గ్రామ అధ్యక్షుడు మాచర్ల నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు డోలా శివకుమార్, దీపాల శివప్రసాద్, వామనపల్లి కోటేశ్వరరావుతో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. వేమూరు, అమర్తలూరు, కొల్లూరు మండలాల్లోని వివిధ గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆనందబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

➡️