ఉదయ కుమారికి అభినందన

Apr 25,2024 01:06 ##inkollu #teacher

ప్రజాశక్తి – ఇంకొల్లు
స్థానిక బాలికొన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న వడ్లపల్లి ఉదయ కుమారి ఆమె భర్త డిసిఆర్‌ఎం కాలేజీ రిటైర్డు ప్రిన్సిపాల్‌ కుర్రా హనుమంతరావును ఆ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు బుధవారం ఘనంగా సత్కరించారు. పాఠశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉదయ కుమారి 31ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ ఎందరో విద్యార్ధుల భవిష్యత్తుకు బాటలు వేశారని అన్నారు. తోటి ఉపాధ్యాయులు ఆమెను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని అన్నారు. విద్యార్ధులు కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు పొందాలని కోరారు. ఉదయ్ కుమారి యూటీఎఫ్ అభివృద్ధి కోసం కూడా పనిచేశారని అన్నారు. ఈనెల 31న ఆమె ఉద్యోగ విరమణ చేయనున్న సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేసినట్లు భర్త కురా హనుమంతురావుతో పాటు ఆమె కుమారుడు, కోడలు, అల్లుడు, కూతురు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో యుటిఎఫ్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️