సముద్ర తీరంలో పర్యాటకుల సందడి

Jul 14,2024 22:25 ##Chirala #Beach

ప్రజాశక్తి – చీరాల
వాడరేవు, రామాపురం సముద్రతీర ప్రాంతాల్లో అధికారులు బీచ్ ఓపెన్ చేయడం, ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులతో సముద్రతీరంలో సందడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసులు గస్తీ నిర్వహించారు. పర్యాటకులను తీరంలో ఎక్కువ దూరం వెళ్లకుండా కట్టడి చేశారు. ఇటీవల పలువురు యువకులు సముద్ర తీరంలో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో కొద్దిరోజులుగా బీచ్‌ను అధికారులు మూసివేశారు. గత 20రోజులుగా సముద్ర తీరం బోసిపోయింది. తాజాగా బీచ్‌కు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు వర్షం సైతం లెక్కచేయకుండా వచ్చారు. ఈపురుపాలెం ఎస్‌ఐ శివకుమార్, మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు పర్యాటకులకు ప్రమాదం జరగకుండా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పర్యాటకులు అందరూ పోలీసులకు సహకరించి నిర్ణయించిన ప్రాంతాల్లోనే సముద్ర స్నానాలు చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో మునగ వద్దని సూచించారు.

➡️