ప్రజాశక్తి – వేటపాలెం
మండలంలోని దేశాయిపేట పంచాయితీ సాయినగర్లో నివాసం ఉంటున్న పేద దేవాంగ చేనేత కార్మికుడైన పసుమర్తి మధుమోహనరావుకు రూ.20వేల ఆర్థిక సహాయం ఆదివారం అందజేశారు. గత కొంత కాలం నుంచి పక్షవాతంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇద్దరు ఆడపిల్లలు రాధిక, నాగవేణి ఇంజనీరింగ్ చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం, వైద్య సహాయం దేశాయిపేట మాజీ సర్పంచ్ నాసిక వీరభద్రయ్య సూచన మేరకు కుటుంబ సభ్యులకు దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు నగదు రూపంలో సహాయం చేశారు. కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుర్మా రాహుల్జి, బండ్ల బాబు, యారాసు అరుణ్ బాబు, చింతా రాము, భూషణ్ శ్రీనివాసరావు, పృద్వి ఆదిశేషు, నాసిక శివాజీ, పింజల శ్రీనివాసరావు, దేవన విజయలక్ష్మి, భూసం వెంకటసుబ్బయ్య, లేళ్ల చంద్రశేఖర్, గుపర్తి మోహన్ పాల్గొన్నారు.
