వైద్యశాల సిబ్బందికి దుప్పట్లు పంపిణీ

Aug 27,2024 23:51 ##Repalle #WomensClub

ప్రజాశక్తి – రేపల్లె
ప్రముఖ విద్యావేత్త, స్వర్గీయ లయన్ దాసరి స్వతంత్ర ప్రసాద్ 5వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి మంగళవారం దుప్పట్లు పంపిణీ చేసినట్లు మదర్ తెరిసా మహిళా యునెస్కో క్లబ్ కన్వీనర్ దాసరి ఝాన్సీ లక్ష్మి తెలిపారు. దాసరి స్వర్ణ ప్రసాద్ మాస్టర్ విద్యా రంగంలోనే కాకుండా సేవా రంగంలోనూ అనేక సేవలు అందించారని అన్నారు. ప్రజల ఆదరణ అభిమానాన్ని పొందారని తెలిపారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వ వైద్యశాల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి దుప్పట్లు అందజేసినట్లు తెలిపారు. మహిళా యునెస్కో క్లబ్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా యునెస్కో క్లబ్ కన్వీనర్ దాసరి ఝాన్సీ లక్ష్మి, సభ్యులు ఆస్మా కె శ్రీలక్ష్మి, డాక్టర్ పృథ్వితేజ, ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.

➡️