పాఠశాలకు ప్యాన్ల బహుకరణ

ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని నాగులపాలెంలోని నాగుబడి రంగయ్య, అచ్చమ్మ బదిరుల పాఠశాల విద్యార్థుల తరగతి గదులకు ఉపయోగపడే విధంగా రొటేరియన్ కోడూరి సుబ్రహ్మణ్య చారి ఆర్థిక సహాయంతో ఐదు సీలింగ్ ఫ్యాన్లను రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగబైరు శ్రీనివాసరావు చేతుల మీదుగా గురువారం అందజేశారు. కొమ్మలపాటి మనోజ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు విద్యార్థినీ, విద్యార్థుల మధ్య జరుపుకొని అందరికీ స్వీట్స్ పంచి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ మూగ, చెవిటి పిల్లల కొరకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆదుకుంటామని అన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి పoబి సదానందరెడ్డి, పాబొలు ఉదయ భాస్కర్, తోకల కృష్ణమోహన్, కాసా అశోక్ కుమార్, కోట శ్రీనివాసరావు, మున్నoగి వెంకట సుబ్బయ్య, అగ్నిగుండల కృష్ణ, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️