ప్రజాశక్తి – వేటపాలెం
మండలంలోని పందిళ్ళపల్లిలోని రెండు ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న 50మంది విద్యార్థులకు పందిళ్ళపల్లి జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేటపాలెం రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు బట్ట మోహనరావు మాట్లాడుతూ విద్యార్థుల వసతుల కల్పనకు పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించి బాగా చదివి ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. పూర్వ విద్యార్థి సంఘం కార్యదర్శి దశరథరామిరెడ్డి, పృధ్వి రాజు, పృధివి వీరాంజనేయులు, రామబ్రహ్మం, పోలకం బాలాజీ, పాఠశాల హెచ్‌ఎం ఎస్‌వి లక్ష్మి, బాజీ వలి, ఉపాధ్యాయులు పల్లవి శ్రీమన్నారాయణ, ప్రసాద్, గాయత్రి పాల్గొన్నారు.
