గెలుపు సంబరాల్లో స్వీట్లు పంపిణీ

Jun 10,2024 23:15 ##Kolluru #tdpnews

ప్రజాశక్తి – కొల్లూరు
ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించటంతో పాటు వేమూరులో నక్క ఆనందబాబుకు భారీ మెజార్టీ లభించటం పట్ల టిడిపి కొల్లూరు మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు. మండలంలో 8వేలకుపైగా ఓట్ల మెజారిటీ టిడిపికి రావడానికి కృషి చేసిన మురళీకృష్ణను కొల్లూరు గౌడపాలెం టిడిపి యూత్ సత్కరించారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి నిరంతరం కృషి చేయడమే కాక మండలంలో అధిక మెజార్టీ రావడానికి తోడ్పాటు అందించారని టిడిపి, జనసేన నాయకులు సత్కరించటం ఆనందంగా ఉందని మురళీకృష్ణ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో టిడిపికి ఓట్లు వేసి గెలిపించేందుకు సహకరించిన టిడిపి, జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గౌడపాలెం టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️