యూకే ఎన్నారైల ఆధ్వర్యంలో అన్నదానం

ప్రజాశక్తి – వేటపాలెం
జాండ్రపేట శివాలయంలోని కళ్యాణ మండపంలో యూకే ఎన్నారైలు బట్ట రవివర్మ, బట్ట రుద్రవర్మ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం చేసి జనసేన అధినేతకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాసిక వీరభద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించేందుకు జనసేనని పవన్ కళ్యాణ్ చేసిన కృషి అమోఘం, అద్వితీయమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తిని అన్నారు. చేనేతలు చీరాలలో అధికంగా ఉన్నారని, వారి సమస్యల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. జనసేన మండల అధ్యక్షుడు ఉగ్గిరాల మార్కండేయులు మాట్లాడుతూ ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్రిమూర్తులుగా వ్యవహరించి రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించేందుకు కృషి చేశారని అన్నారు. టిడిపి సీనియర్‌ నాయకులు సిద్ధి వెంకట బుచ్చేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తని కొనియాడారు. సమస్యలపై పోరాటంలో ఆయనకాయనే సాధ్యమని అన్నారు. చేనేత సమస్యల సాధన కోసం కృషి చేసి కొంతమేరకు విజయం సాధించారని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 200 మంది పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో బట్ట మోహనరావు, పుష్పవల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బట్ట మోహనరావు, జనసేన వీర సైనికులు బుద్ధి శ్రీహర్ష, మామిడాల శ్రీనివాసరావు, అనుమాలశెట్టి కిషోర్, వేటపాలెం పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు ప్రతి వెంకట సుబ్బారావు, జ్యోతిర్మయి దేవాంగ సంఘం అధ్యక్షుడు గౌరబతుని రవిబాబు, దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర్మా రాహుల్ జి, ఉపాధ్యాయులు పింజల శ్రీనివాసరావు, గుత్తి పరంజ్యోతి పాల్గొన్నారు.

➡️