దుగ్గిరాల ఉద్యమం స్ఫూర్తిదాయకం

Jun 10,2024 23:31 ##Bapatla #Duggirala

ప్రజాశక్తి – బాపట్ల
స్వాతంత్ర్య సమర యోధులు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య పోరాటం, ఉధ్యమం స్పూర్తిదాయకమని తహశీల్దారు ఎం శ్రావణ్‌కుమార్‌ అన్నారు. బాపట్ల తాహశీల్దారు కార్యాలయంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పనిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. గోపాలకృష్ణయ్య 96వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో దుగ్గిరాల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, ఆంధ్ర గాంధీగా ఖ్యాతి కెక్కిన గోపాలకృష్ణయ్య దేశంలోనే మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా ఎంపికైన తొలి ఆంధ్రుడు దుగ్గిరాల అన్నారు. రామ దండును ప్రారంభించి ప్రజలను జాగృతం చేసి చీరాల – పేరాల ఉద్యమంలో ప్రజలను 11నెలల పాటు ఏకతాటిపై నడిపించిన ఆయన త్యాగం నిరుపమానమైనదని అన్నారు. బాపట్లతో ఆయనకున్న అనుబంధాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, డిప్యూటీ తహశీల్దారు కె శ్రీదేవి, చిల్లా సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️