విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ ఎన్నిక

Jun 10,2024 00:23 ##Addanki #TDP

ప్రజాశక్తి – అద్దంకి
పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో సంఘ అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా విభాగం పట్టణ కమిటీ అధ్యక్షరాలుగా సొలస లీలా కుమారిని నియమించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ టిడిపి సాధికార కమిటీ కన్వీనర్ తువ్వపాటి జనార్ధనాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల్లో మహిళలను కూడా చైతన్యవంతులు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. నూతనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు, అద్దంకి ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో టిడిపి నాయకులు చెన్నుపల్లి కోటిలింగాచారి, చోడ వెంకట సుబ్బారావు, ఆళ్లగడ్డ వీర సుందరాచారి, ఏలూరు వీర బ్రహ్మచారి పాల్గొన్నారు.

➡️