పది విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

Feb 11,2024 22:43

ప్రజాశక్తి – రేపల్లె
విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనదని నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ అంబటి సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని నారాయణ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్ధికీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు 10వ తరగతితోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలంటే 10వ తరగతి కీలకమని అన్నారు. 10వ తరగతి తర్వాత ఆ విద్యార్థికి ఉన్నటువంటి ఆకాంక్షను బట్టి ఉన్నత విద్యకు మార్గం ఏర్పడుతుందని అన్నారు. ఆ మార్గాన్ని తానే ఎంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆనవాయితీగా పాఠశాల స్థాయిలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి చదువుతూ పాఠశాలను విడిచి వెళ్లే విద్యార్థులను అభినందిస్తూ వీడ్కోలు సభ ఏర్పాటు చేయటం జరుగుతుందని అన్నారు. 10వ తరగతి విద్యార్థులు 9వ తరగతిలో ఉన్న విద్యార్థులకు దిశ, నిర్ధేశం చేస్తూ వీడ్కోలుగా పలికే సందర్భం జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎజిఎం వెంకటేశ్వరరావు, అకడమిక్ డీన్ ఫణి కుమార్, వైస్ ప్రిన్సిపాల్ జగదీష్ పాల్గొన్నారు.

➡️