చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన

ప్రజాశక్తి – వేమూరు
మండలంలోని కుచ్చెళ్ళపాడులో చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. బాపట్ల ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఆర్ బాల మురళీధర్ నాయక్ అధ్యక్షత వహించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జె రాధాకృష్ణ రైతులకు జొన్న పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు. జొన్న పంటలో ఆశించే కత్తెర పురుగు, మువ్వు పురుగు, బూజు తెగులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త ఎం ఉషారాణి మాట్లాడుతూ జొన్న పంటలో మేలైన రక విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. దీనికోసం నంద్యాల తెల్ల జొన్న (ఎన్టిజే5) 95 నుండి100 రోజుల్లో దిగుబడి 18 నుండి 20 బస్తాల వరకు లభిస్తుంది అన్నారు. ఎంపీడీఒ సుబ్బారావు చేతుల మీదుగా రైతులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎఒ సిహెచ్ సునీత, విఎఎ సిహచ్ జీవమణి, సర్పంచి గాజుల వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

➡️