శుభకార్యక్రమాల్లో మాజీ మంత్రి ఆనందబాబు

Feb 24,2024 23:28

ప్రజాశక్తి – భట్టిప్రోలు
భట్టిప్రోలు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బట్టు మల్లికార్జునరావు నూతన గృహప్రవేశ మహోత్సవంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు శనివారం పాల్గొన్నారు. భట్టిప్రోలులో నివాసం ఉంటూ వ్యాపార రీత్యా ఆంధ్ర ప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో మల్లికార్జున గృహం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. నియోజకవర్గంలో టిడిపి అభివృద్ధికి, బీసీల సంక్షేమానికి మల్లికార్జునరావు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బీసీలంతా ఏకతాటిపై నడిచి, బీసీలకు ప్రత్యేక గుర్తింపును అందించిన టిడిపి గెలుపుకు కృషి చేయాలని ఆనందబాబు కోరారు.

➡️