ఉచిత ప్యాబ్రిక్ డిజైనింగ్ శిక్షణ

Jun 10,2024 00:19 ##school #parchuru #rotary

ప్రజాశక్తి – పర్చూరు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక భవనం వీరారెడ్డి రోటరీ భవనం నందు ప్యాబ్రిక్ డిజైనింగ్, పెయింటింగ్ నిపుణులచే ఉచిత శిక్షణా శిబిరం సామాజిక వేత్త నర్రా లక్ష్మీసుధ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు నాగబైరు శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ సుధ మాట్లాడుతూ మహిళలకు ఎంతో ఉపయోగకరమై ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధికి దోహద పడగలదని తెలిపారు. ఎక్కువ మంది హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ అడ్వకేట్ కొల్లా నరేంద్ర కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పంబి సదా నందరెడ్డి, రోటరీ సభ్యులు గడ్డిపాటి శ్రీనివాసరావు, కోమటి ఆంజనేయులు, కుట్టు శిక్షణ నిపుణురాలు దగ్గుబాటి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

➡️