గాంధీజీ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి

Oct 2,2024 11:56 #Bapatla District

స్పెషల్ ఆఫీసర్ శేషయ్య

ప్రజాశక్తి – చీరాల : జాతిపిత గాంధీజీ సేవలను నేటి సమాజంలో యువత అందరూ ఆదర్శంగా తీసుకోని నడచుకోవాలని కొత్తపేట పంచాయతీ ప్రత్యేక అధికారి శేషయ్య అన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్బంగా స్థానిక కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఆ పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా స్వాతంత్ర సమరంలో గాంధీజీ అందించిన విశేష సేవలను కొనియాడారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️