రామోజీరావుకు గొట్టిపాటి, ఏలూరి ఘన నివాళి

ప్రజాశక్తి – అద్దంకి
అక్షర యోధుడు, నిరంతర శ్రామికుడు, రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ఈనాడు వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు అస్తమించడంతో శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ రామోజీరావు పార్థీవ దేహాన్ని సందర్శించి ఘన నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కొల్లూరు : స్థానిక టిడిపి కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కనకాల మధుసూధన ప్రసాద్ ప్రముఖ పారిశ్రామికవేత్త చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి శనివారం ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గుత్తికొండ బుజ్జి, ధూళిపూడి కృష్ణ, సమ్మెట దుర్గాప్రసాద్, నాని, సుధాకరరావు, మేకల బాలాజీ, ఆలపాటి వాసు, తోట సాంబశివరావు, మత్తి నాగేంద్ర, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్టూరు రూరల్ : ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పద్ధతులు, సలహాలు, సూచనలు అందించేందుకు ఎంఎల్‌ఎ ఏలూరి ఆధ్వర్యంలో రంగు రంగుల పేజీలతో అగ్రి క్లినిక్ మాసపత్రికను రైతుల చెంతకు చేర్చిన ఏలూరిని అప్పట్లో రామోజీరావు అభినందించారని గుర్తు చేసుకున్నారు.
ఇంకొల్లు : టిడిపి, జనసేన, బిజెపి నాయకులు టిడిపి కార్యాలయం వద్ద రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామాజీరావుకు మృతికి సంతాపం ప్రకటించారు. కొద్దిసేపు మౌనం పాటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయుడు హనుమంతరావు, బొడావుల శ్యామ్‌సుందర్, గంట బాబు, కరణం రమేష్, పాలేరు రామకృష్ణ, శ్రీనివాసరావు, పి హనుమయ్య, ఎం శ్రీనివాసబాబు.,పెదపూడి విజయకుమార్ పాల్గొన్నారు.
బాపట్ల : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతికి ఎంఎల్‌ఎ వేగేశన నరేంధ్రవర్మ సంతాపం తెలిపారు. రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించారు.

➡️